ఇంటర్ మెమోలలో ఫెయిల్ బదులు రీ అప్పియర్‌.!

ఇక నుంచి ఇంటర్‌ మెమోలో ఫెయిల్‌ అనే పదం కనిపించదు. దానికి బదులు రీ-అప్పీయర్‌ అని పెట్టాలని ఇంటర్మీడియట్ అధికారులు భావిస్తున్నారు.

ఫెయిల్‌ అనే పదం ద్వారా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బోర్డు భావిస్తోంది. ఈ మేరకు బోర్డు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి, ప్రభుత్వానికి సమర్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

Follow Us @