ఎయిడెడ్ లెక్చరర్ లు అతిథి అధ్యాపకుల స్థానాలలోకి

తెలంగాణ రాష్ట్రం లోని ఎయిడెడ్ జూనియర్ కాలేజీ లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లను ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంజూరు అయ్యి అతిథి అధ్యాపకులు పని చేస్తున్న స్థానాల్లోకి నియమించుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. 

ప్రవేట్ యాజమాన్యంలో ఉండి స్టాప్ కి ప్రభుత్వం జీతాలు చెల్లించే  ఎయిడెడ్ కాలేజీలలో తక్కువ విద్యార్థుల సంఖ్య ఉండడం వలన, వర్క్ లోడ్ లేకపోవడంతో అక్కడ కోర్సులను ఎత్తివేస్తూ, అక్కడ పనిచేస్తున్న ఎయిడెడ్ జూనియర్ లెక్చరర్లను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంజూరు అయ్యి ఖాళీగా ఉన్న పోస్టులలో మరియు అతిథి అధ్యాపకులు పనిచేస్తున్న పోస్టులలోకి రీడిప్లై చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. 

దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీలో ఉన్న మంజూరు అయినా పోస్టుల్లో ఖాళీగా ఉన్న మరియు అతిథి అధ్యాపకులు పనిచేస్తున్న డేటాను కళాశాలల వారీగా ఇంటర్ వర్గాలు తెప్పించుకోవడం కోసం ప్రొపార్మా పంపినట్లు గా సమాచారం.  

Follow Us@