తెలంగాణ రాష్ట్రం లో జూలై 1 నుండి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమవుతాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు.
ఈ నేపథ్యంలో జూన్ 25 నుంచి కళాశాలలకు ప్రిన్సిపాల్స్, రెగ్యులర్, కాంట్రాక్ట్ , ఎంటీఎస్, ఎంటీఎస్ అవర్లీ బేసిస్ లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది పూర్తిస్థాయిలో కళాశాలలకు హాజరుకావాలని జిల్లా ఇంటర్ విద్యాధికారులకు కమిషనరేట్ నుండి ఆదేశాలు జారీ అయ్యాయి.
కళాశాలకు హాజరై ఆన్లైన్ తరగతులకు సంబంధించిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వాట్స్అప్ గ్రూపులు జూమ్ గ్రూపులు తయారు చేసి విద్యార్థులను ఆన్లైన్ తరగతులకు సన్నద్ధం చేసే చర్యలను తీసుకోవాల్సిందిగా…, అలాగే కరోనా నివారణ చర్యల్లో భాగంగా కళాశాలలను స్థానిక సంస్థల సహకారంతో పూర్తి స్థాయిలో శానిటేషన్ చేయించేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు.