ఈ నెలలో ఇంటర్ తరగతులు ప్రారంభం.?

తెలంగాణ రాష్ట్రంలోని  జూనియర్ కళాశాలలను డిసెంబర్ నెలలో పున ప్రారంభించడం కోసం ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి  ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ప్రభుత్వం ఆమోదం తెలిపితే డిసెంబర్లో ఇంటర్ తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 

ఇప్పటికే విలువైన 5 నెలల సమయం వృధా కావడంతో సెప్టెంబర్ లో ఆన్లైన్ తరగతులు ప్రారంభించిన విషయం తెలిసిందే. సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ కూడా ముఖ్యమైనవి కాబట్టి కనీసం 120 రోజులు పని దినాలు గా లేకుండా పబ్లిక్ పరీక్షలను నిర్వహించడం అసాధ్యం అయిన నేపథ్యంలో తరగతుల ప్రారంభానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది అని ఇంటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి. 

ప్రభుత్వం వైద్య కుటుంబ ఆరోగ్య శాఖ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

Follow Us@