865 పాలిటెక్నిక్ సిబ్బంది రెన్యూవల్

తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మంజూరు అయిన పోస్టులలో పనిచేస్తున్న 865మంది కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రస్తుత విద్యా సంవత్సరానికి (01-06-2020 నుండి 31 -05-2021 వరకు) రెన్యువల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది..

ఈ విద్యాసంవత్సరంలో జూన్ 1 నుండి మే 31 వరకు లేదా అవసరమైనంత వరకు వీరిని కొనసాగించాలని సాంకేతిక విద్యా కమీషనరేట్ కోరింది.

అలాగే 11 నూతన పాలిటెక్నిక్ కళాశాలలోని 135 జూనియర్ లెక్చరర్ పోస్టులలో అలాగే 77 వర్క్ షాప్ అటెండెంట్ పోస్టులలో పని చేస్తున్న వారిని కూడా ఈ విద్యా సంవత్సరానికి రెన్యూవల్ చేయాలని సాంకేతిక విద్యా కమీషనరేట్ కు ప్రభుత్వం సూచించింది.

ఉత్తర్వులు pdf ::

https://drive.google.com/file/d/1UDTDbG6knw0Zps-6KhkFnex_ZtlR1UvH/view?usp=drivesdk

Follow Us @