హైదరాబాద్ (జూలై – 13) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్, గెస్ట్, ఔట్ సోర్సింగ్ అధ్యాపకులు, సిబ్బందిని ఈ విద్యాసంవత్సరం కొనసాగించేందుకు ఇంటర్ విద్య కమిషనరేట్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
ఇందులో 499 కాంట్రాక్టు లెక్చరర్లు, ఇద్దరు పార్టమ్ లెక్చరర్లు, ఒక సీనియర్ ఇన్స్ట్రక్టర్, 1,654 మంది గెస్ట్ ఫ్యాకల్టీ, 53 మంది వొకేషనల్ పార్టెమ్ లెక్చరర్లు, 44 పార్ట్ టైమ్ ల్యాబ్ అటెండర్లు, 52 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కలుపుకుంటే మొత్తం 2,255 ఉద్యోగులను రెన్యువల్ చేయాలని కోరుతూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు ప్రతిపాదనలు పంపించారు.
★ మరిన్ని వార్తలు