58 ఏళ్లు దాటిన సీజేఎల్స్ కు వేతనాలు నిలిపివేత

  • పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులు రాకపోవడంతో నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 58 ఏళ్లు పైబడిన కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లకు వేతనాలు చెల్లింపు లు నిలిపివేయాలని ఇంటర్ విద్యా శాఖ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు.

ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు ప్రభుత్వం గతం లోనే పెంచిన సంగతి తెలిసిందే. దాన్ని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింప చేస్తూ ఉత్తర్వులు వెలువడలేదు. దీనిపై ఇంటర్ విద్యాశాఖ గత నవంబరు 8న ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదు. ఈ క్రమంలో 58 ఏళ్లు దాటిన వారికి వేతనాలు ఇవ్వొద్దని జిల్లాల ఇంటర్ విద్యాశాఖ అధికారులను కమిషనర్ ఆదేశించారు.

విరమణ వయసుపై ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులివ్వాలని ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యా పకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ డిమాండ్ చేశారు.
ఇదే అంశంపై గత నెలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అధ్యాపకులు మాత్రం యథావిధిగా విధులకు హాజరవుతున్నారు.

Follow Us @