ఎం.టీ.ఎస్. మరియు పార్ట్ టైమ్ జూనియర్ లెక్చరర్ ల వేతనాలు పెంపు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం హవర్లీ బేసిస్ జూనియర్ లెక్చరర్లకు, మినిమమ్ టైం స్కేల్ కింద పని చేస్తున్న జూనియర్ లెక్చరర్, సీనియర్ ఇన్స్ట్రక్టర్, ల్యాబ్ అటెండర్ లకు నూతన పీఆర్సీ 2020 ప్రకారం వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు వెల్లడించారు.

పార్ట్ టైం హవర్లీ బేసిస్ జూనియర్ లెక్చరర్లకు తరగతికి 300 రూపాయల నుంచి 390 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరికి నెలకు గరిష్టంగా 28,080/- వేతనం అందుకోనున్నారు.

అలాగే మినిమం టైం స్కేల్ కింద పని చేస్తున్న జూనియర్ లెక్చరర్లకు 54,220/- రూపాయలు మరియు డీఏ, సీనియర్ ఇన్స్ట్రక్టర్లకు 31,040/- మరియు డీఏ, ల్యాబ్ అటెండర్ లకు 22,240/- మరియు డీఏ లను వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు వెల్లడించారు.

Follow Us @