840 మంది కేజీబీవి ఉద్యోగుల తొలగింపు

విజయవాడ (జూన్ – 23) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో గత ఎడెనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్న దాదాపు 840 మంది పార్ట్ టైం, గెస్ట్ సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.

నూతన నియామకాలలో గతంలో పని చేసిన వీరికి ప్రాధాన్యత ఇవ్వకుండా నియామకాలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమకు విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీ లో పని చేసిన సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు.