జగిత్యాల (ఫిబ్రవరి – 03) : దశాబ్దాలుగా ఇంటర్మీడియట్ విద్యలో పేరుకుపోయిన పలు సమస్యల పరిష్కారానికి, ఇంటర్ విద్య పరిరక్షణకు ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ చేపట్టిన పలు సంస్కరణలు ఇంటర్మీడియట్ విద్య పటిష్ఠానికి ఎంతో దోహదపడతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం (475)జగిత్యాల జిల్లా అధ్యక్షులు రేమిడి మల్లారెడ్డి అన్నారు.
శుక్రవారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ కమిషనర్ కార్యాలయం కొన్ని దశాబ్దాలుగా అవినీతిపరుల అక్రమార్కుల అడ్డాగా మారిందని, అనతి కాలంలోనే అలాంటి అక్రమార్కుల భరతం పట్టి ఇంటర్మీడియట్ విద్య కార్యాలయాన్ని గాడిలో పెట్టారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సిబ్బంది హాజరును మెరుగుపరుచుటకు బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేశారని, ఈ ఆఫీస్ పద్ధతి ద్వారా త్వరితగతిన సమస్యల పరిష్కారం అయ్యేందుకు కృషి జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా విద్యలో సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రోడీకరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందిస్తూ.. త్వరితగత ఫలితాలను అందించడానికి ఆన్ లైన్ మూల్యాంకన పద్ధతిని ప్రవేశపెట్టిన మహనీయుడని కొనియాడారు . ఇటీవల రెవెన్యూ మరియు భూ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా పదోన్నతి లభించిన నవీన్ మిట్టల్ ను ఈ విద్యా సంవత్సరం పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యేంత వరకు ఇంటర్మీడియట్ కమిషనర్ గా అదనపు బాధ్యతలతో కొనసాగించి ఇంటర్మీడియట్ విద్యలో సంపూర్ణమైన ప్రక్షాళన చేయుటకు ప్రభుత్వం కృషి చేయాలని అయన ప్రభుత్వాన్ని కోరారు.
Follow Us @