- డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు అవకాశం
హైదరాబాద్ (డిసెంబర్ – 31) : దీరుభాయ్ అంబానీ జ్ఞాపకార్దం రిలయన్స్ పౌండేషన్.వారు
రిలయన్స్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ (Undergraduate Scholarship) మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కింద 5,000 మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు 2 లక్షల వరకు స్కాలర్‌షిప్ ప్రకటించింది.
◆ అర్హతలు : కుటుంబ వార్షికాదాయం రూ.15 లక్షల లోపు ఉండాలి. ఏదైనా విభాగంలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్స్ చదువుతూ ఉండాలి. డిగ్రీ మొదటి సంవత్సరంలో చదువుతున్నవారు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయొచ్చు. ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ఎన్‌రోల్ అయి ఉండాలి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ పథకం కోసం డిగ్రీ లో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
◆ దరఖాస్తు చివరి తేదీ : 2023 ఫిబ్రవరి 14 లోగా దరఖాస్తు చేయాలి.
◆ ఎంపికైనవారికి : కోర్సు పూర్తి చేసేవరకు రూ.2 లక్షల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. స్కాలర్‌షిప్‌తో పాటు వైబ్రంట్ అల్యూమిని నెట్వర్క్‌లో భాగస్వాములవుతారు. తర్వాత కూడా ఉన్నత విద్య అభ్యసించడానికి కావాల్సిన సపోర్ట్ లభిస్తుంది.
◆ వెబ్సైట్ :
https://scholarships.reliancefoundation.org/UG_Scholarship.aspx