కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి. – హైకోర్టు

రాంచి (డిసెంబర్ – 23) : 10 ఏళ్లకు పైగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని జార్ఖండ్ హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో… రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధం చేయాలని జస్టిస్ ఎస్.ఎన్. పాఠక్ ఆదేశించారు. రిట్ పిటిషన్ పై తుది తీర్పును ఇస్తూ.. వారు 10 ఏళ్లకు పైగా పనిచేస్తున్నందున ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వారి సేవలను క్రమబద్ధీకరించవలసి ఉంటుందని కోర్టు పేర్కొంది.. అని పిటిషనర్ తరపు న్యాయవాది విపుల పొద్దార్ అన్నారు. ఈ కేసులో సీనియర్ న్యాయవాది ఇంద్రజీత్ సిన్హాకు సహకరించారు.

ఇప్పటివరకు జరిగింది చాలని పేర్కొంటూ… భవిష్యత్ నియామకాలన్నీ క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని, ఇప్పటికే కొనసాగుతున్న ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కాంట్రాక్టు వర్కర్లలో అధిక శాతం మంది రవాణా శాఖ, ఇతర విభాగాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. మంజూరైన పోస్టులలో పార్ట టైమ్ వర్కర్లను సక్రమంగా నియమించిన సందర్భాల్లో మాత్రమే కోర్టుల ద్వారా క్రమబద్ధీకరణ అమలులోకి వస్తుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది.

2017లో తన సర్వీసును రెగ్యులరైజ్ చేయాలంటూ చేసిన విజ్ఞప్తిని జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించడంతో రవాణా శాఖ ఉద్యోగి నరేంద్ర తివారి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 2018లో మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కేసును పున:పరిశీలించాలని సుప్రీంకోర్టు హైకోర్టుని ఆదేశించింది.