MTS లెక్చరర్ లకు పోస్టింగ్స్ కేటాయింపు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న మినిమం టైం స్కేల్ అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తూ ఉన్నత విద్యాశాఖ జీవో జారీ చేసిన నేపథ్యంలో…. ఇంటర్మీడియట్ కమిషనర్ ఈరోజు సంబంధిత MTS లెక్చరర్ లను వారు పని చేస్తున్న స్థానంలోనే రెగ్యులర్ పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

వీరికి రెగ్యులర్ లెక్చరర్ ల మాదిరిగా వేతన స్కేల్ 54,220 – 1,33,630 అమలు చేస్తూ విధులలోకి వెంటనే తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ లకు కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు.

ఉత్తర్వులు కాపీ

ఇంటర్మీడియట్ జనరల్ విభాగంలో 22మంది‌, వొకేషనల్ విభాగంలో 52 మంది ని ప్రభుత్వం క్రమబద్ధీకరించిన విషయం తెలిసిందే.