114 మంది లాబ్ అటెండర్ల క్రమబద్ధీకరణ

హైదరాబాద్ (జూలై – 20) : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మినిమం టైం స్కేల్ కింద ఒకేషనల్ విభాగంలో పనిచేస్తున్న 114 మంది లాబ్ అటెండర్లను జీవో నెంబర్ 16 ప్రకారం క్రమబద్ధీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని జీవో నెంబర్ 16 విడుదల చేసి వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్న విషయం తెలిసిందే.