క్రమబద్ధీకరణకు అర్హుల జాబితా వెంటనే పంపండి – ఉన్నత విద్యా శాఖ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్ లను క్రమబద్ధీకరిస్తామని హమీ నేపథ్యంలో ప్రకారం ఉన్నత విద్యా శాఖ పరిధిలో ఉన్న జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల క్రమబద్ధీకరణ సంబంధించిన ప్రపోజల్స్ ను వెంటనే ఉన్నత విద్యా శాఖకు పంపించాలని ఉన్నత విద్యా శాఖ ఈ రోజు మెమో జారీ చేసింది.

క్రమబద్ధీకరణకు అర్హులైన వారి జాబితాను పంపమని ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ వివిధ డిపార్ట్మెంట్ లకు ఆదేశాలు జారీ చేసి రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో మరొకసారి క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం కోసం వెంటనే అర్హులైన జాబితాను ఉన్నత విద్యాశాఖకు పంపాలని మెమోలో పేర్కొన్నారు. ఇప్పటికే జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాంట్రాక్టర్ల లెక్చరర్ లకు సంబంధించిన డేటాను వారి కమిషనరేట్ల లో క్రోడీకరించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా పాలిటెక్నిక్ లెక్చరర్ అసోసియేషన్ తరపున ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు, కాంట్రాక్టు లెక్చరర్ల జేఏసీ చైర్మన్ కనకచంద్రంకు‌, టీజీడీఎల్ఎ అధ్యక్షుడు వినోద్ కుమార్, శ్రద్దానంధం లు మరియు కో చైర్మన్ అరుణ్ ఇమ్మాన్యుయోల్, అస్మతుల్లా ఖాన్ లు కృతజ్ఞతలు తెలిపారు

Follow Us @