ప్రభుత్వానికి చేరిన కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితా

హైదరాబాద్ (ఆగస్టు – 28) : తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 2,951మంది కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల (జనరల్ విభాగం) జాబితా క్రమబద్దీకరణ కోసం ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించారు.

ఆ జాబితాను 4 విభాగాలుగా విభజించారు. అధ్యాపకులుగా చేరే నాటికి తగిన విద్యార్హత లేని వారు 37 మంది, పదవీ విరమణ వయసు మించిపోయిన వారు 111 మంది, ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదివిన వారు 325 మంది ఉన్నారని, ఈ మూడు సమస్యలు లేని వారు 2,478 మంది ఉన్నారని ఆ జాబితాలో పేర్కొన్నారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

వొకెషనల్ కాంట్రాక్ట్ అధ్యాపకుల జాబితా కూడా వేగంగా తయారు చేస్తున్నట్లు వీలైనంత త్వరగా ప్రభుత్వానికి పంపడానికి ప్రయత్నాలు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Follow Us @