హిమాచల్ ప్రదేశ్ లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ

హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు మార్చి 31- 2021 వరకు మూడు సంవత్సరాలు ఎలాంటి బ్రేక్ లేకుండా సర్వీస్ లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని అలాగే సెప్టెంబర్ 31 – 2021 వరకు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్లకు కూడా క్రమబద్ధీకరణకు జరుగుతుందని పేర్కొన్నారు.

క్రమబద్ధీకరణకు అర్హతలను కింది విధంగా పేర్కొన్నారు.

1) కాంట్రాక్టు ఉద్యోగి క్రమబద్ధీకరించబడిన పోస్టుకు సంబంధించిన అర్హతలను కలిగి ఉండాలి

2) క్రమబద్ధీకరణ అనేది సీనియార్టీ ఆధారంగా జరుగుతుంది

3) క్రమబద్ధీకరించబడిన పోస్టుకు సంబంధించి మెడికల్ ఫిట్ నెస్ ను అభ్యర్థి కలిగి ఉండాలి. మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ ను ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.

4) అభ్యర్థి యొక్క సత్ప్రవర్తన మరియు అతని పూర్వ సర్వీస్ ను దృష్టిలో ఉంచుకొని ఫైనాన్సియల్ రూల్స్ ఆధారంగా క్రమబద్ధీకరణ అర్హత సాధిస్తాడు.

5) 2009 హిమాచల్ ప్రదేశ్ పైనాన్షియల్ రూల్ 172 ప్రకారం అభ్యర్థి యొక్క పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.

6) శాఖల వారీగా స్క్రీనింగ్ కమిటీ ని ఏర్పాటు చేసి క్రమబద్ధీకరణ ప్రక్రియ జరపాలి

7) క్రమబద్ధీకరణ కాబడిన కాంట్రాక్టు ఉద్యోగులు ఆ పోస్ట్ యొక్క మినిమం టైం స్కేల్ వేతనాలను పొందుతారు.

8) క్రమబద్ధీకరించబడిన ఉద్యోగి రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.

9) క్రమబద్ధీకరణ అనేది ఉత్తర్వుల్లో పేర్కొన్న తేదీల నుండి అమలు అవుతుంది.

DOWNLOAD FILE

Follow Us @