కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

హైదరాబాద్ (జూలై – 28) : తెలంగాణ రాష్ట్రంలోని ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో పనిచేస్తున్న 27 మంది కాంట్రాక్టు ఉద్యోగులను జీవో నంబర్ 16 ప్రకారం క్రమబద్ధీకరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

11003 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన నేపథ్యంలో…. ఇప్పటికే విద్యాశాఖలో వరుసగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఈ శాఖలో కూడా వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకుంది.

ORDER COPY