- పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల క్రమబద్ధీకరణ
తెలంగాణ ప్రభుత్వం మినిమం టైం స్కేల్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకై విడుదల చేసిన జీవో నెంబర్ 16 ప్రకారం పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో మినిమం టైం స్కేల్ కింద పనిచేస్తున్న 65 మంది ఎంఎన్ఆర్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ జీవో నెంబర్ 12 ను ఈరోజు ప్రభుత్వం విడుదల చేసింది.
వీరి క్రమబద్ధీకరణ కచ్చితంగా జీవో నెంబర్ 16 నిబంధనలకు లోబడి ఉండాలని. . అలాగే క్రమబద్ధీకరణ తేదీ వాళ్లు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు పొందిన తేదీ నుండి అమలు అవుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.. అలాగే కచ్చితంగా సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

