BANK JOBS : 9,053 ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్ (జూన్ – 21) : IBPS దేశంలో ఉన్న గ్రామీణ బ్యాంకులలో ఖాళీగా ఉన్న 9,053 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (CRP RRB XII) జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు (rural regional bank jobs notification) ఆన్లైన్ దరఖాస్తు గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో దరఖాస్తు గడువును జూన్ – 28 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్స్ (గ్రేడ్ – 1,2,3) & ఆఫీసు అసిస్టెంట్ (మల్టిపర్ఫస్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 939, తెలంగాణలో 228 ఖాళీలు కలవు. ఏదేని డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ వెబ్సైట్ : https://www.ibps.in/crp-rrb-xii/

◆ దరఖాస్తు చేయడానికి లింక్ : https://ibpsonline.ibps.in/rrbxiioamy23/