జోనల్ విధానం అమలుతో డిస్ట్రబ్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లలో ఆరుగురికి తమ విధులు నిర్వర్తించేందుకు వీలుగా కాలేజీలను కేటాయిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో కొంత మంది కాంట్రాక్టు లెక్చరర్లకు పోస్టింగ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే.

317 జీవోలో భాగంగా 90 మంది శాశ్వత అధ్యాపకులను మల్టీ జోనల్ వారీగా మార్పు చేసింది. దీంతో వారు కేటాయించిన జిల్లాల్లోని కాలేజీల్లో చేరారు. ఫలితంగా అక్కడ అప్పటివరకు పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు విధులకు దూరమవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వారు ఇంటర్ బోర్డ్‌ను ఆశ్రయించారు.