డిస్ట్రబ్డ్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు పోస్టింగ్

317 జీవో అమలు కారణంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లు బదిలీలు జరిగిన నేపథ్యంలో డిస్టృబ్ అయిన 32 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు మరొక కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ కమిషనర్ పోస్టింగ్ ఇచ్చారు.

అయితే కొంతమంది రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ లు మల్టీ జోనల్ బదిలీలు జరిగి మరల ప్రభుత్వ అనుమతితో మరో కళాశాలకు బదిలీ కావడం జరిగింది. ఇలాంటి కళాశాలలో పాత కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లనే కొనసాగించాలని ఇంటర్మీడియెట్ కమీషనర్ ఉత్తర్వులలో తెలిపారు.

Follow Us @