డిస్టర్బ్ గెస్ట్ లెక్చరర్లను రీ అలాట్ మెంట్ చేయాలని ఉత్తర్వుల విడుదల పై హర్షం

  • తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామెర ప్రభాకర్, జనరల్ సెక్రటరీ దార్ల భాస్కర్

ఇంటర్ కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ శనివారం నాడు అన్ని జిల్లాల ఇంటర్ అధికారులకు డిస్టర్బ్ అయిన గెస్ట్ లెక్చరర్ల వివరాలు సేకరించి అందుబాటులో ఉన్న మరొక ఖాళీలలో అడ్జస్ట్ చేయాలని ఆదేశాలు (ప్రొసీడింగ్స్) విడుదల చేయడం పట్ల తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ సంఘం రాష్ట్ర నాయకులు కె మహేష్ కుమార్, రీనా, కవిత, నవమణి లు శనివారం నాడు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు

317 జీవో ప్రకారం జరిగిన ఉద్యోగుల బదిలీల కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్స్ గా పనిచేస్తున్న కొంతమంది డిస్టర్బ్ కావడం జరిగింది. అనంతరం మళ్ళీ స్పౌజ్ కారణంగా ప్రత్యేక అనుమతితో 25 మంది గవర్నమెంట్ లెక్చరర్లు బదిలీ కావడంతో మరికొంతమంది గెస్ట్ లెక్చరర్లు డిస్టర్బ్ అయ్యారు..ఆ తర్వాత జరిగిన 40 మంది కాంట్రాక్టు లెక్చరర్ల అడ్జస్ట్ మెంట్ కారణంగా మరికొంతమంది గెస్ట్ లెక్చరర్లు డిస్టర్బ్ అయి వారి ఉపాధిని కోల్పోయారు. ఈ క్రమంలో జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ల సంఘం – 2152 ఆధ్వర్యంలో చేసిన ప్రయత్నాలు మేరకు రీఅలాట్మెంట్ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఏ కారణం చేతనైనా గెస్ట్ లెక్చరర్ డిస్టర్బ్ అయితే మరొక చోట అధికారికంగా రీ అలాట్ కావచ్చని పేర్కొన్నారు.

ఈ క్రమంలో డిస్టర్బ్ గెస్ట్ లెక్చరర్లకు రీ అలాట్ చేయాలని 2152 గెస్ట్ లెక్చరర్ల సంఘం చేసిన వినతిని పరిగణలోకి తీసుకుని సానుకూల నిర్ణయం తీసుకున్న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, టి హరీష్ రావు, కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ లకు, సహకరించిన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బోయినపల్లి వినోద్ కుమార్, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఇంటర్ బోర్డు డీడీ లక్ష్మారెడ్డి, ఓఎస్డీ అబ్దుల్ ఖాలీక్, ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్ల సంఘం భాద్యులు జంగయ్య, రామకృష్ణ గౌడ్ లకు, ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఉన్న అన్ని సంఘాల భాద్యులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us @