ముంబై (డిసెంబర్ – 07) : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) తాజాగా నిర్వహించిన ద్రవ్య పరపతి కమిటీ (MPC) రేపో రెటును 35 బెసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ప్రస్తుత రెపో రేటు 6.25 శాతానికి చేరింది.
మే 2022 లో 4.4 శాతం ఉన్న రెపో రేటు ప్రస్తుతం 6.25 శాతానికి చేరింది. దీంతో ఈ ఏడాది 225 బెసిస్ పాయింట్లు పెంచినట్లు అయింది.
స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 6 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు 6.5 శాతానికి, బ్యాంకు రేటును 6.5 శాతానికి పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.
REPO RATE – 6.25%
SDF RATE – 6.00%
MSF RATE – 6.50%
BANK RATE – 6.50%
◆ రెపో రేటు :- బ్యాంకులు సెక్యూరిటి లు పెట్టి ఆర్బీఐ దగ్గర తీసుకునే రుణాలకు విధించే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు.