ముంబై (అక్టోబర్ – 01) : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ 28, 29 తేదీలలో నిర్వహించిన మోనిటరింగ్ కమిటీ కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలో ద్రవ్యోల్బణం(INFLATION) తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యం ఒకవైపు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోతున్న మరోవైపు వెంటాడుతున్న నేపథ్యంలో వీటిని కట్టడి చేసే కీలక నిర్ణయాలను ఆర్బిఐ తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతదాస్ నిర్ణయాలను వివరించారు.
★ నిర్ణయాలు :
◆ రేపో రేటు : ద్రవ్యాల్బోణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది దీనితో రెపో రేట్ విలువ 5.9 శాతానికి చేరింది.
◆ జీడీపీ అంచనాలు : 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీలో వృద్ధి 7% గా ఉంటుందని ప్రకటించింది. గతంలో 7.8% నుండి, 7.2% తగ్గించి ప్రస్తుతం 7% గా నిర్ణయించింది.
◆ కరెంట్ ఖాతా లోటు : ప్రస్తుతం ఇది 3% లోపలే ఉంది. దేశ ఎగుమతుల దిగుమతు మద్య అంతరాన్ని తెలిపే లోటు ను కరెంటు ఖాతా లోటు అంటారు.
◆ ద్రవ్యోల్బణం : మార్కెట్ లో వస్తు సేవల విలువలు క్రమంగా పెరుగుటను ద్రవ్యోల్బణం అంటారు. 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 6.7% ఉండవచ్చని అంచనా వేసింది. ఆర్బీఐ ద్రవ్యోల్బణం ఆమోదయోగ్య స్థాయి 2 – 6%.
◆ ద్వైపాక్షిక వాణిజ్యం లో రూపాయి : అంతర్జాతీయ వాణిజ్యం ద్రవ్య మారకంగా రూపాయి ని ప్రమోట్ చేయడానికి ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.