ముంబై (మే – 21) : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2 వేల నోట్లు ఉపసంహరించుకున్న నేపథ్యంలో వాటిని బ్యాంక్ లలో మార్చుకోవడానికి కీలక సూచనలు చేసింది.
నోట్ల మార్పిడికి ప్రజలెవరూ ఐడెంటిటీ ప్రూఫ్ చూపాల్సిన అవసరం లేదని తెలిపింది.
రిక్వెస్ట్ లెటర్ లేదా ఎలాంటి ఫాం నింపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఒక విడతలో గరిష్టంగా రూ.20వేల వరకు నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది.
నోట్లు మార్పిడికి తుది గడువు సెప్టెంబర్ – 30 – 2023