BIKKI NEWS (FEB. 17) : RAVICHANDRAN ASHWIN @ 500 TEST WICKETS – భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ లో 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రాజ్ కోట్ టెస్టులో ఓపెనర్ క్రాలీ ని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఘనతను సాధించాడు.
అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లు తీసిన 9వ బౌలర్ గా మరియు భారత్ తరపున అనిల్ కుంబ్లే (619) తర్వాత రెండో బౌలర్ గా అశ్విన్ నిలిచాడు.
అశ్విన్ ఆడుతున్న 98వ టెస్ట్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించడం విశేషం. అలాగే బంతుల పరంగా చూస్తే 500 వికెట్లు తీసిన బౌలర్లలో తక్కువ బంతుల్లో 500 వికెట్లు తీసిన రెండో బౌలర్ గొ అశ్విన్ నిలిచాడు
ఓకే ఎనిమిదింగ్స్ లో ఐదు వికెట్లు 34 సార్లు మ్యాచ్ మొత్తం మీద పది వికెట్లు 8సార్లు తీశాడు.
అత్యధిక వికెట్లు ముత్తయ్య మరళీదరన్ – 800, షేన్ వార్న్ – 708, జేమ్స్ అండర్సన్ – 696 లతో మొదటి మూడు స్థానాలలో ఉన్నారు.