BIKKI NEWS : టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో ఇండియన్ రెజ్లర్ రవికుమార్ దహియా సిల్వర్ మెడల్ (RAVI KUMAR DAHIA WON SILVER IN TOKYO OLYMPICS) సాధించాడు. ఈ రోజు 57 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రష్యన్ ఒలింపిక్ కమిటీకి చెందిన రెజ్లర్ జవుర్ ఉగుయెవ్ మీద 4-7 తేడాతో ఓడిపోయాడు.
ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సిల్వర్ గెలిచిన రెండో ఇండియన్ రెజ్లర్‌గా అతడు నిలిచాడు. గతంలో 2012 ఒలింపిక్స్‌లో సుశీల్‌కుమార్ రెజ్లింగ్‌లో సిల్వర్ సాధించిన విషయం తెలిసిందే.