BIKKI NEWS : భారత దేశంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక క్రికెట్ ట్రోఫీ రంజీ ట్రోఫీని (Ranji Trophy 2022 ) ఈ ఏడాదికి గాను మధ్యప్రదేశ్ ముంబై ని ఓడించి మొదటిసారి కైవసం చేసుకుంది.
రికార్డుస్థాయిలో 41 ఒక్కసార్లు రంజీ ట్రోఫీని గెలుచుకున్న ముంబై జట్టు ఫైనల్ లో మధ్యప్రదేశ్ చేతిలో ఓడిపోయింది.
డ్రాగా ముగిసిన ఫైనల్ పోరులో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యత ఆధారంగా మధ్యప్రదేశ్ ను విజేతగా ప్రకటించారు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మధ్యప్రదేశ్ బ్యాట్స్ మెన్ శుభమ్ శర్మ నిలిచారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా టోర్నమెంట్ లో శతకాలతో చెలరేగిన ముంబై బ్యాట్స్ మెన్ సర్ఫరాజ్ ఖాన్ నిలిచారు.