రజనీకాంత్ కి దాదాసాహెబ్ పాల్కే అవార్డు.

థలైవా, ఇండియన్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు కేంద్రం దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఆయనకు ఇస్తున్నట్లుగా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ప్రకటించారు.

భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుండి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం అందిస్తుంది.

ఈ గౌరవం గతంలో తెలుగు సినీ పరశ్రమకు చెందిన

  • బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి.
  • ఎల్వీ ప్రసాద్‌.
  • నాగిరెడ్డి.
  • అక్కినేని నాగేశ్వరరావు.
  • రామానాయుడు.
  • కె. విశ్వనాథ్.‌
  • బాలచందర్‌(తెలుగు, తమిళం)
    పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు.
Follow Us @