హైదరాబాద్ (జూలై – 27) : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవును మరో రోజు పొడిగించింది 28వ తేదీ కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటికే సెలవులు కారణంగా పోయిన వారం రెండు రోజులు, ఈ వారంలో రెండు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.