RAIN HOLIDAYS : శనివారం విద్యా సంస్థలకు సెలవు

హైదరాబాద్ (జూలై – 21): తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది.

మరో 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జులై 22 (శనివారం) కూడా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.