న్యూడిల్లీ (జూన్ – 28) : భారతీయ రైల్వే శాఖలో అన్ని విభాగాల్లో కలిపి జూన్-1 – 2023 నాటికి 2.74 లక్షల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రైల్వేశాఖ సమాచార హక్కు చట్టం కింద సమాదానం ఇచ్చింది.
ఒక్క సేఫ్టీ కేటగిరీలోనే 1,77,924 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్-1 నాటికి సేఫ్టీ విభాగంలో 9,82,037 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. 8,04,113 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసినట్లు రైల్వేశాఖ పేర్కొంది.