న్యూడిల్లీ (మార్చి – 24) : కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. పరువునష్టం కేసులో దోషిగా తేలి రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడిన నేపథ్యంలో రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు అయింది.
ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాహుల్ మాజీ ఎంపీ అయ్యారు. కాగా, ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుందో?’ అని రాహుల్ 2019లో వ్యాఖ్యానించారు. దీంతో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.