కాంట్రాక్టు అధ్యాపకులకు బేసిక్ పే కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు – మైనారిటీ సంఘం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు పీఆర్సీ ప్రకారం బేసిక్ పే కల్పించడం పై మైనారిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు రహీమ్ ధన్యవాదాలు తెలిపారు. కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాలు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాయని ఈ సందర్భంగా రహీమ్ పేర్కొన్నారు

ప్రస్తుతం నూతన పీఆర్సీ ప్రకారం రెగ్యులర్ లెక్చరర్ లతో సమానంగా బేసిక్ పే కల్పించడం పట్ల సీఎం కేసీఆర్ కి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు తెలంగాణ మైనారిటీ కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల సంఘం (TSMCLA – 1342) తరపున యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి ఎండీ రహీమ్, మిన్హాజ్ ఉల్ హక్, అన్సారీలు అభినందనలు తెలియజేశారు.

Follow Us@