ఎంపీ రఘురామకృష్ణ రాజుకు షరతులతో బెయిల్

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అతని మోపిన అభియోగాలు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేంత తీవ్రమైనవి కాదని, పిటిషనర్‌ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.

అయితే కేసు దర్యాప్తుకు రఘురామకృష్ణరాజు సహకరించాలని పేర్కొంది. పిటిషనర్‌ మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదని తెలిపింది. కేసు విచారణకు అవసరమైతే కనీసం ఒక రోజు ముందు పిటిషనర్‌కు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.

న్యాయవాది సమక్షంలో దర్యాప్తు అధికారి ఎదుట హాజరవ్వొచ్చని తెలిపింది. రఘురామ, మరో ఇద్దరు వ్యక్తులు రూ.లక్ష పూచీకత్తును పది రోజుల్లో ట్రయల్‌ కోర్టులో సమర్పించాలని సుప్రీం కోర్ట్ ఆదేశించింది.

Follow Us@