హ్యాట్రిక్ అవార్డ్ ల విజేత రచ్చ జ్యోత్స్నరాణి

  • సేవకు గుర్తింపుగా వరుసగా మూడు సంవత్సరాలు అవార్డుల అందజేత.

మహబూబాబాద్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రచ్చ జ్యోత్స్న రాణి తాను అందిచిన సేవలకు గుర్తింపుగా వరుసగా మూడు సంవత్సరాలు ఉత్తమ ఉద్యోగి అవార్డులను అందుకొని పలువురికి ఆదర్శంగా నిలిచారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్ బోర్డు ప్రకటించిన ఉత్తమ ఎంప్లాయ్ అవార్డులలో జ్యోత్స్న రాణి డిజిటల్ కంటెంట్ ప్రిపరేషన్ అండ్ రికార్డింగ్ విభాగంలో చురుకుగా సేవలను అందించినందుకు ఆమెకు మరో మారు ఈ అవార్డ్ దక్కింది.

ఆదివారం నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం లో జరిగిన వేడుకలలో బోర్డ్ సెక్రటరీ ఓమర్ జలీల్ చేతుల మీదుగా ఈ మేరకు జ్యోత్స్న రాణి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల ప్రసారం, ప్రణాళిక రచన, రికార్డింగ్ వంటి పలు కార్యక్రమాలలో జ్యోత్స్న రాణి సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తించినందుకు ఈ ఉత్తమ ఉద్యోగి అవార్డ్ ను రాష్ట్ర స్థాయిలో మరోమారు అందుకున్నారు.

2019వ సంవత్సరంలో జనగామ జిల్లా నుండి ఉత్తమ ఉద్యోగిగా,2020వ సంవత్సరంలో బెస్ట్ టీచర్ అవార్డ్ ను రాష్ట్ర స్థాయిలో అందుకున్నారు. 2021వ విద్యా సంవస్చరంలో ఇంటర్ బోర్డ్ ద్వారా దూరదర్శన్ నందు ప్రసారం అవుతున్న పాఠ్యాంశాలను పర్యవేక్షిస్తూ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ ను వరుసగా మూడవ సంవత్సరం కూడ అందుకోవడం శుభపరిణామంగా పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఈ సందర్భంగా జ్యోత్స్న రాణిని మహబూబాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి ఎస్. సత్యనారాయణ, బాలికల కళాశాల అధ్యాపక బృందం, జనగామ జిల్లా ఇంటర్ విద్యాధికారి బైరి శ్రీనివాస్, దర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం అభినందించారు.

Follow Us @