FORBES 25 : అత్యధిక వేతనం పొందుతున్న మహిళా అథ్లెట్లు 2022

హైదరాబాద్ (డిసెంబర్ – 26) : FORBES 2022వ సంవత్సరంలో అత్యధిక వేతనం పొందిన మహిళ అథ్లెట్స్ జాబితాను FORBES 25 పేరుతో విడుదల చేసింది.

ఇందులో భారత్ నుండి కేవలం పీవీ సింధు (PV SINDHU) మాత్రమే చోటు సంపాదించింది పీవీ సింధుకి 12వ స్థానం కేటాయించారు. పూసర్ల వెంకట సింధు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2016 లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. టోక్యో 2020 ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకుంది

25 జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన మహిళ అథ్లెట్ గా నియోమి ఒసాక (NIOMI OSAKA) నిలిచారు. నియోమి ఒసాకా రెండు యూఎస్, రెండు ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్స్ నెగ్గింది. వరల్డ్ టెన్నిస్ ర్యాంకింగ్స్ లలో మొదటి స్థానంలో నిలిచిన మొదటి ఆసియా టెన్నిస్ క్రీడాకారిణి గా రికార్డు సృష్టించింది.