- TELEOS-2, లూమాలైట్ 4 ఉపగ్రహలను విజయవంతంగా కక్ష్యలోకి
శ్రీహరి కోట (ఎప్రిల్ – 22) : భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని షార్ నుంచి ఈరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV C55) ద్వారా చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది.
ఈ ప్రయోగం ద్వారా సింగపూర్ కు చెందిన 741 కిలోల బరువుగల టెలీయోస్-2, 16 కిలోల లూమోలైట్-4 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ వాహకనౌక విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
టెలీయోస్-2 ఉపగ్రహం సింగపూర్ ప్రభుత్వానికి చెందినది. ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఉపగ్రహంలో సింథటిక్ ఎపర్చరు రాడార్ పేలోడ్ ను ఉంచారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో కవరేజీ అందించగలదు.
లూమాలైట్ 4 ఉపగ్రహాన్ని ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫోకామ్ రీసెర్చ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లోని శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు.