PSLV C51 ప్రయోగం విజయవంతం

BIKKI NEWS : నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఇస్రో ఈ ఏడాది చేపట్టిన మొదటి PSLV C-51 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ప్రకటించారు.

ఆదివారం ఉదయం 10.24 గంటలకు PSLV C- 51 లాంచ్ చేసిన తర్వాత 17 నిమిషాల పాటు ప్రయాణించి బ్రెజిల్‌కు చెందిన అమోజోనియా శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

బ్రెజిల్‌ దేశ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి మార్కోస్‌ క్వాంటస్‌ షార్‌ లో ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. PSLV C-51 వాహకనౌక ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజొనియా-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపారు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మోదీ పేరు, ఫొటో, ఆత్మనిర్భర్‌ మిషన్‌ పేరు, భగవద్గీత కాపీ, వెయ్యిమంది విదేశీయుల పేర్లతో పాటు చెన్నైకి చెందిన విద్యార్థుల పేర్లను అంతరిక్షంలోకి పంపించినట్టు ఇస్రో తెలిపింది.

ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ మాట్లాడుతూ ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో, బ్రెజిల్‌ అనుసంధానంతో చేపట్టిన మొదటి ప్రయోగం పట్ల గర్వంగా ఉందని. బ్రెజిల్ కు అభినందనలు తెలిపారు. అలాగే దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశపెట్టామని శివన్‌ తెలిపారు