కాసేపట్లో PSLV C51 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో తొలి అంతరిక్ష ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేసింది. పిబ్రవరి 28న చేపట్టనున్న PSLV – C51 ప్రయోగంతో వాణిజ్యరంగంలో తొలి అడుగు వేయనుంది. పిబ్రవరి 28 ఉదయం 10.24గంటలకు PSLV – C51 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

అమెజానియా-1తో పాటు మరో 18 ప్రైవేటు ఉపగ్రహాలను రాకెట్‌ మోసుకెళ్లనుంది. న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ నేతృత్వంలో నింగిలోకి తొలి వాణిజ్య ఉపగ్రహాలను PSL కక్షలోకి ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన స్పేస్‌ బీస్‌ పేరుతో 12 ఉపగ్రహాలు, సాయ్‌–1 నానో కాంటాక్ట్‌–2 అనే ఒక ఉపగ్రహంతో పాటు యూనిటీశాట్‌ పేరుతో మూడు యూనివర్సిటీల విద్యార్థులు తయారుచేసిన మూడు ఉపగ్రహాలు, సతీశ్‌ ధావన్‌ శాట్, సింధునేత్ర అనే ఉపగ్రహాలను రోదసీలోకి పంపనుంది.

సతీశ్‌ ధావన్‌ శాట్ ఉపగ్రహం ద్వారా నరేంద్ర మోడీ మరియు భగవధ్గీత ను అంతరిక్షంలోకి పంపనుంది.

Follow Us@