డిసెంబ‌ర్ 17న PSLV C50 ప్రయోగం

శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ రెండో ప్ర‌యోగ‌ వేదిక‌ నుంచి క‌మ్యూనికేష‌న్ శాటిలైట్ CMS – 01ను PSLV C – 50 ద్వారా డిసెంబ‌ర్ 17వ తేదీన మ‌ధ్యాహ్నం 3:41 గంట‌ల‌కు నింగిలోకి ప్ర‌యోగించ‌నున్న‌ట్లు ఇండియ‌న్ స్పేస్ రీసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్‌(ISRO) ప్ర‌క‌టించింది.

భార‌త‌దేశ‌పు 42వ క‌మ్యూనికేష‌న్ ఉప్ర‌గ‌హం అయినా CMS-01 ఫ్రీక్వెన్సీ స్పెక్ర్టంలో విస్త‌రించిన C – బ్యాండ్ సేవ‌ల‌ను అందించేందుకు నిర్దేశించారు.

దీని పరిధిలోనికి భార‌త ప్రధాన భూభాగంతో పాటు అండ‌మాన్ నికోబార్ దీవులు, ల‌క్ష్వ‌దీప్‌లను కూడా కవర్ చేస్తుంది.

PSLV C – 50 అనేది PSLV సిరీస్ లో 52వ ప్రయోగం మరియు షార్ నుంచి ఇది 77వ మిష‌న్ అని ISRO పేర్కొంది.

PSLV C50 BROUCHER ::

https://drive.google.com/file/d/1PIivYIj3pKmYZZtk8ehQJb8daMeQfK7j/view?usp=drivesdk

Follow Us@