తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు ఉమ్మడి జిల్లా సీనీయారిటి ఆధారంగా పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని PRTU TS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉపాద్యాయుల పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఎమ్మెల్సీ లు జనార్దన్ రెడ్డి, రఘోతం రెడ్డి ల ఆద్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు కూడా సానుకూలంగా స్పందించి అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
2003 ఉపాధ్యాయులకు పాత పింఛన్ అమలు పై మంత్రి తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని తెలిపారు. అలాగే హెల్త్ కార్డుల విషయంలో ఉపాద్యాయుల నుండి ప్రీమియం తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
Follow Us@