పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ప్రమోషన్స్ ప్రక్రియ ప్రారంభం అయింది. రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలతో పాటు జిల్లా కలెక్టరేట్లలోనూ దీనిపై కసరత్తు జరగుతుంది.

జనవరి నెలాఖరులోగా పూర్తి స్థాయిలో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసి, తద్వారా ఏర్పడే ఖాళీల జాబితాలను రూపొందించి ఉద్యోగ నోటిఫికేషన్ లు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించారు.

రాష్ట్రంలో 34 ప్రధాన శాఖలున్నాయి, వాటికి అనుబంధంగా మరో 40 శాఖలున్నాయి. 104 శాఖాధిపతుల కార్యాలయాలున్నాయి మరియు 33 జిల్లాలున్నాయి. వీటన్నింటా కలిపి వేలాది మంది ఉద్యోగులకు పదోన్నతులు రానున్నాయి.

Follow Us@