పాఠశాల PD లకు కళాశాల PD లుగా పదోన్నతి.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ హైస్కూల్ లు, మరియు జిల్లా పరిషత్ హైస్కూల్లలో పని చేస్తున్న గ్రేడ్ – II ఫిజికల్ డైరెక్టర్ (P.D.) లను రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ (P.D.)లు గా పదోన్నతి కల్పించడానికి కావలసిన సీనియార్టీ లిస్టు తయారుచేసి ఇంటర్మీడియట్ కమిషనరేట్ కు పంపాలని పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ హైస్కూల్ మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ లలో పనిచేస్తున్న గ్రేడ్ 2 ఫిజికల్ డైరెక్టర్లు సీనియార్టీ లిస్టును డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లు తయారు చేసి రీజియన్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (RJDSE) వారికి జిల్లాల వారీగా పంపాలని, RJDSE లు జనవరి 18 లోపు ఇంటర్మీడియట్ కమిషనర్ కు జోన్స్ వారీగా సీనియార్టీ లిస్టును పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Follow Us @