BIKKI NEWS (APR. 09) : Project serve on communication and interview skills for inter students. ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమ్యూనికేషన్ మరియు ఇంటర్వ్యూ స్కిల్స్ పై ప్రాజెక్ట్ SERVE యొక్క తొలి ఆన్లైన్ సెషన్ ప్రారంభించింది.
Project serve on communication and interview skills for inter students.
ఇంటర్మీడియట్ విద్యా శాఖ ప్రాజెక్ట్ SERVE యొక్క కమ్యూనికేషన్ మరియు ఇంటర్వ్యూ స్కిల్స్ పై మొదటి ఆన్లైన్ సెషన్ ను విజయవంతంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్ నగరంలోని 2 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల నుండి పాల్గొన్న విద్యార్థులతో పైలట్ కార్యక్రమంగా TGBIE కాన్ఫరెన్స్ హాల్ లో ప్రారంబించబడింది .
ఎక్ స్టెప్ ఫౌండేషన్ తో భాగస్వామ్యంగా నిర్వహించబడిన ప్రాజెక్ట్ SERVE అనేది అన్ని ప్రభుత్వ జూనియర్ మరియు వృత్తి విద్యా కాలేజీలలో విద్యా నాణ్యతను ఆన్లైన్ ప్లాట్ ఫారమ్ ద్వారా మెరుగుపర్చడానికి ఉద్దేశించిన ఒక కొత్త ఆలోచన.
ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ SERVE కోఆర్డినేటర్ గోపాల బాల సుబ్రహ్మణ్యంతో పాటు, డైరెక్టర్, ఇంటర్మెడియట్ విద్య శ్రీ కృష్ణ ఆదిత్య, ఐ.ఏ.ఎస్. కమ్యూనికేషన్ స్కిల్ నిపుణుడు వరప్రసాద్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ. కృష్ణ ఆదిత్య, ఐ.ఏ.ఎస్., మాట్లాడుతూ ఎక్ స్టెప్ ఫౌండేషన్ ద్వారా దశల వారీగా అమలు చేయబడుతున్న ఈ డిజిటల్ విద్యా కార్యక్రమం ద్వారా అధ్యాపకుల కొరత, నైపుణ్యాలలో లోపాలు మరియు డ్రాప్ అవుట్ రేట్లు వంటి ప్రధాన సవాళ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రోగ్రామ్ మొదటి దశలో పైలట్ కార్యక్రమంగా గవర్నమెంట్ వృత్తి జూనియర్ కాలేజ్, నాంపల్లి మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, చంచలగూడ లో డిజిటల్ క్లాసులను ప్రారంభించారు, ఇది విద్యార్థులకు శ్రేష్ఠమైన విద్యా అవకాశాలను అందించేందుకు తోడ్పడుతుందన్నారు.
విద్యార్థులకు నిరంతర విద్యా అవకాశాలను అందించేందుకు, పరిమిత విద్యా సిబ్బంది ఉన్న కాలేజీలకు ఒక భాగస్వామ్య డిజిటల్ ప్లాట్ ఫారమ్ ద్వారా పాఠాలు ప్రసారం చేయబడతాయి, దీనిద్వారా విద్యార్థులు డిజిటల్ క్లాసుల రూపంలో అవాంతరం లేకుండా బోధన పొందడానికి సహాయపడుతుంది.
కమ్యూనికేషన్ స్కిల్ నిపుణుడు వరప్రసాద్ “సమర్థవంతమైన కమ్యూనికేషన్ మరియు ఇంటర్వ్యూ స్కిల్స్” పై విద్యార్థులకు విలువైన పాఠాలను అందించారు. ఆయన విజయానికి కావలసిన లక్షణాలు – ప్రేరణ, క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం, నిబద్దత, పట్టుదలతో అభ్యాసం, శాంతి, శరీరభాష మరియు విజయ సాధనలో ఆత్మవిశ్వాసం గురించి వివరించారు. 21 రోజులపాటు నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వారికి హాజరు, దృష్టి, మర్యాద, ఆవిష్కరణలు చేయడం, క్రమశిక్షణ మరియ ఏకాగ్రత వంటి విజయ మార్గాలు జీవితం లో అలవర్చుకునేల తోడ్పడతాయని ప్రాజెక్ట్ SERVE గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో విద్యా పరివర్తన కోసం ప్రేరేపించే ఇటువంటి మార్పులను తీసుకురావడానికి ఉద్దేశించబడిందని పేర్కొన్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్