BIKKI NEWS (JULY 04) : Programme on Drugs awareness in GJC Medipally ప్రభుత్వ జూనియర్ కళాశాల మేడిపల్లి లో విద్యార్థులకు డ్రగ్స్ నివారణ మరియు వాటి వాడకం వల్ల కలిగి నష్టాల గురించి ప్రిన్సిపాల్ వై. రమేష్ బాబు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Programme on Drugs awareness in GJC Medipally
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారి ఆధ్వర్యంలో జులై 1,2 తేదీలలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి స్టూడెంట్స్ కౌన్సిలర్ కు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం యువత చెడు దారిన పడకుండా డ్రగ్స్ మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా వారి యొక్క ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా తయారు చేయాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం
దీనికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల మేడిపల్లి ప్రిన్సిపల్ వై. రమేష్ బాబు గారు మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వలన కలిగే పర్యవసనాలు మరియు కలిగే నష్టాలు వివరించడం జరిగింది.
ఈ కళాశాలలో స్టూడెంట్ కౌన్సిలర్ అనీష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 2 రోజుల ట్రైనింగ్ లో వారికి తెలిపిన విషయాలను మరియు మత్తు పదార్థాలు వాడినా అమ్మిన కొనుగోలు చేసిన వాటిని ఒక చోటు నుంచి ఇంకో చోటికి సరఫరా చేసిన ఒక సంవత్సరం నుంచి దాదాపు పది సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని వాటి గురించి చక్కగా వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ సాయి కృష్ణ, రాంబాబు, రాజు, జ్ఞానేశ్వర్, ప్రసాద్, నాగేశ్వరి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్