ఢిల్లీ (అక్టోబర్ – 01) : నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) ప్రొఫెసర్ల నియామకానికి అర్హతలను సడలించింది. కేవలం నిర్దేశిత విద్యార్హతలు ఉన్నవారినే కాకుండా వివిధ వృత్తుల్లో నైపుణ్యం ఉన్న వారిని ప్రొఫసర్లుగా నియమించుకోవడానికి అనుమతిస్తూ శుక్రవారం మార్గదర్శకాలు జారీచేసింది.
ప్రస్తుతం ఉన్న పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చేలా విద్యారంగాన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఉన్నత విద్యలో పరిశ్రమ – విద్యా రంగం మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ పేర్కొన్నారు. ‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్’ పేరుతో కొత్తవారిని బోధకులుగా తీసుకోవడంవల్ల తరగతులకు అనుభవపూర్వకమైన నైపుణ్యం రావడంతో పాటు, ఉన్నత విద్యాసంస్థల్లో బోధనా సిబ్బంది నివారించడానికి వీలవుతుందనేది. యూజీసీ ఉద్దేశం.
◆ UGC మార్గదర్శకాలు :
- విద్యార్హతలతో సంబంధం లేకుండా ఇంజినీరింగ్, సాంకేతికం. పరిశ్ర మలు, వాణిజ్యం, సామాజికశాస్త్రం, మీడియా, సాహిత్యం, లలితకళలు, సివిల్ సర్వీసెస్, సాయుధ దళాలు తదితర రంగాల్లో విశిష్టమైన నైపుణ్యం, విస్తృత అనుభవం (కనీసం 15 ఏళ్లు) ఉన్న వారిని ప్రొఫెసర్లుగా తీసుకోవచ్చు.
- అయితే వీరి సంఖ్య ఉన్నత విద్యా సంస్థలకు మంజూరుచేసిన పోస్టుల్లో 10%కి మించకూడదు.
- ఈ ప్రొఫెసర్లను కోర్సులు, పాఠ్యాంశాల రూపకల్పనలో భాగస్వాములుగా చేయొచ్చు.
- యూనివర్సిటీ కాలేజీలకు మంజూరుచేసిన పోస్టులకు అతీతంగా వీరి నియామకం జరుగుతుంది అందువల్ల అధికారికంగా మంజూరు చేసిన పోస్టులపై ఎలాంటి ప్రభావం చూపదు.
- గౌరవవేతనం ఎంత చెల్లించాలన్నది ఉన్నత విద్యాసంస్థలే నిర్ణయించుకోవచ్చు.
- ‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్’కు గరిష్టంగా మూడేళ్లకు మించి అవకాశం ఇవ్వకూడదు. అరుదైన కేసుల్లో ఏడాది పొడిగించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి సర్వీసు నాలుగేళ్లకు మించకూడదు.