న్యూఢిల్లీ (ఆగస్టు 23) : విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపకులు (ఫ్యాకల్టీ సభ్యులు)గా ప్రత్యేక నిపుణులను నియమించుకొనేందుకు త్వరలో మార్గం సుగమం కానున్నది. ఈ నియామకాలకు అకడమిక్ క్వాలిఫికేషన్లు, ప్రచురణలు తప్పనిసరి కాదు. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గత వారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకొన్నది. ‘ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్’ అనే ఈ పథకాన్ని వచ్చే నెలలో నోటిఫై చేసే అవకాశం ఉన్నది. అయితే ఒక ఉన్నత విద్యాసంస్థకు మంజూరైన మొత్తం ఫ్యాకల్టీ పోస్టుల్లో ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్
ద్వారా నియమితులైనవారి సంఖ్య ఏ సమయంలోనూ 10 శాతానికి మించకూడదని యూజీసీ నిర్ణయించింది.
సాయుధ బలగాల తోపాటు ఇంజినీరింగ్, సైన్స్, మీడియా, లిటరేచర్, ఎంటర్టైన్యూర్షిప్, సోషల్ సైన్సెస్, ఫైన్ ఆర్ట్స్, సివిల్ సర్వీసెస్ తదితర రంగాలకు చెందిన నిపుణులను అధ్యాపకులుగా నియమించుకొనేందుకు వీలుంటుందని ఆమోదిత ముసాయిదా మార్గదర్శకాల్లో పేర్కొన్నట్టు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఆయా రంగాల్లో ఇప్పటికే తమ నైపుణ్యాన్ని ని చుకొన్నవారు లేదా కనీసం 15 ఏండ్ల నుంచి సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులు ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ కు అర్హులవుతారని, ఈ మార్గదర్శకాలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని తెలిపింది.