ప్రైవేటు విద్యా సంస్థల బోధనా సిబ్బందికి సాంఘీక భద్రత కల్పించాలి – రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్

ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న బోధనా సిబ్బందికి సాంఘీక భద్రత కల్పించే విధంగా పార్లమెంట్‌లో చట్టాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు.

ప్రైవేటు రంగంలోని స్కూల్స్, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలలోని బోధనా సిబ్బంది కరోనా నేపథ్యంలో అభత్రతా భావంతో విధులు నిర్వహిస్తున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ఈ పరిస్థితులు మారాలంటే చట్టంతో పాటు టీచింగ్ సెస్ ను సేకరించాలని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ సెస్ నుంచి నిధులను సంబంధిత బోధనా సిబ్బంది కుటుంబ సభ్యులకు ఆదుకునేందుకు వీలు కలుగుతుందని వినోద్ పేర్కొన్నారు. ఇదే తరహా విధానం బిల్డింగ్ నిర్మాణ రంగంలో అమలు అవుతోందని బి. వినోద్ కుమార్ గుర్తు చేశారు.

Follow Us@